Posts

లలితాసహస్రనామములు

శ్రీమాతా! శ్రీమాతా ! తరమా విరించి ప్రభృతుల్ చింతించి నిట్టూర్చినన్   నీ మాతృత్వమునెంచిజూడ ! జగముల్ నీ గర్భమందుద్భవం బై మాతా యనిబిల్చు , నీవెకద యంబా ! త్రైగుణమ్ముల్ సదా     సమ్మేళించుచు తత్వముల్ చిలికి యీ సంతానమున్ దీర్చుటల్ !  తొల్లిదలంచెదన్ తూరుపు తెల్లవారకనె తొల్లి దలంచెద నీ ముఖాంబుజా                 పార మరంద మాధరుల , పండిన బింబము వంటి వాతెరన్ తారల కాంతులన్ తరుము తారపు నాశిక , దీర్ఘనేత్రముల్ , ఆ రతనాల లోలకులు , హాసము , తిల్కములంబికా భజే . తూరుపు తెల్లవారకనె తొల్లి భజించెద కెంపుటుంగరాల్ తీరుగ బూన్చు అంగుళులు , దివ్య మణుల్ ఘటియించినట్టి బం గారపు గాజులున్ , చెరకు కార్ముకమంకుశమున్ , ప్రసూనముల్ , తోరపు పాశమున్ కలిగి దోసము లేని కరమ్ములంబికా . తూరుపు తెల్లవారకనె తొల్లియె మ్రొక్కెద నీ పదమ్ములన్ , పారములేని యాదరణ భక్తుల బ్రోచి తరింపజేయు సం సార సముద్రమున్ , జలజసంభవుడాది సువర్గ పూజ్యముల్ , సారసమంకుశధ్వజము , చక్రపు గుర్తులతోడ యంబికా . తూరుపు తెల్లవారకనె తొల్లి   నుతుల్ లలితాంబికా
Recent posts